ద్రోణ వరంగల్
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసిన ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని ప్రతి ఒక్కరు చెట్లను నాటే ప్రక్రియలో బాధ్యతగా భావించి నాటిన తర్వాత సంరక్షించే ప్రయత్నం ప్రజలు చేసిన నాడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు స్పష్టం చేశారు.

వర్ధన్నపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కళాక్షేత్రంలో వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛధనం – పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.అనంతరం స్వచ్ఛదనం -పచ్చదనం

కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు అధికారులు ప్రజలతో మమేకమై ప్రజలకు అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ప్రతి చెట్టును పరిరక్షించుకోవాలి అని తెలియజేసి 5 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంగోత్ అరుణ, మున్సిపల్ కమిషనర్ జోన, ఎమ్మార్వో, కౌన్సిలర్లు సుధీర్, రవీందర్, డిఎంసి ఏడిఎంసి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, మహిళ సంఘాలు, అంగన్వాడి ఆశావర్కర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
