
నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-
లౌకిక సాంప్రదాయాల పరిరక్షణకు భవిష్యత్తు కార్యచరణలో భాగం కావాలి..
బిజెపి, ఆర్ఎస్ఎస్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడడానికి యువతను చైతన్యవంతం చేయాలి..
CPI జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ.
స్థానిక కొత్త గంజిలోని మర్చంట్ అసోసియేషన్ హాల్ లో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య అధ్యక్షతన జరిగిన సిపిఐ రాజకీయ శిక్షణ తరగతులను ఉద్దేశించి పశ్య.పద్మ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం, లౌకిక సాంప్రదాయాల పరిరక్షణకు భవిష్యత్తు కార్యచరణలో భాగం కావాలన్నారు.

జీవనాన్ని హుందాగా కొనసాగించడానికి పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, సంఘటిత ఉద్యమాలకు, పోరాటాలకు పార్టీ ఆద్వర్యంలో ఇతర వామ పక్ష పార్టీలతో కలిసి కొనసాగించడానికి పార్టీ బలమైన వ్యవస్థగా రూపుదిద్దుకోవాలని అన్నారు. కుల,మతాల పేరిట ప్రజలను విచ్ఛిన్నపరిచి ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకతను పెంచడానికి, విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ఒక మతం పట్ల మరొక మత ప్రజలను ఉసిగొల్పి ఘర్షణలు సృష్టించడానికి తద్వారా ఓట్లను పొంది వారికి లబ్ధి చేకూర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి ప్రయత్నాలు తిప్పి కొట్టాలంటే సిద్ధాంతపరమైన రాజకీయపరమైన అవగాహనను మరింత పెంచుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. వామపక్ష పార్టీల మధ్య ఐక్యతను మరింతగా పెంచుకుంటూ ప్రజాస్వామ్య ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని పోవాలని పిలుపు నిచ్చారు. ప్రజల హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులను కార్పోరేట్ కంపెనీల అడుగుజాడల్లో పాలన కొనసాగిస్తున్న ఎన్డీఏ పాలనకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలను ఏకం చేయాలని అన్నారు. ఎన్డీఏ చేస్తున్న అరాచకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. స్వతంత్రంగా ఉద్యమాలను పోరాటాలను నిర్వహించే విధంగా కార్మిక కర్షక మహిళ యువజన తదితర ప్రజాసంఘాలను నిర్మాణాన్ని పెంచాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజా హక్కులను ప్రతి ఒక్కరు పొందేలా గ్రామస్థాయి నుంచి అవగాహన కల్పించాలన్నారు. అన్ని కులాల అన్ని మతాల ప్రజలు కలిసి బ్రతకడానికి సాంఘిక వాతావరణాన్ని సృష్టిండానికి సమయత్తం కావాలని అన్నారు. లౌకిక సాంప్రదాయాల పరిరక్షణకు, నిరుద్యోగ సమస్య అధిక ధరల అసమానతలను తొలగించడానికి పోరాడుతున్న ఇండియా కూటమితో కలిసి పోరాటాన్ని తీవ్రతరం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, కామారెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు ఓమయ్య, రాజన్న, విట్టల్ గౌడ్, రాజన్న, రాజిరెడ్డి, స్వరూప రాణి, బాల్రాజ్,మరియు పార్టీ,ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు
