Tuesday, May 19, 2026

రైతు గా మారిన మెదక్ జిల్లా కలెక్టర్

పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు

హవేలి ఘనాపూర్

మెదక్ ద్రోణ:-

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం రైతుగా మారారు. ఔరంగాబాద్లోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్కు ఆనుకుని ఉన్న గొల్ల నారాయణ పొలంలో వరి నారు పీకి, నాట్లు వేశారు. రాహుల్ రాజ్ దంపతులు, వారి ఇద్దరి పిల్లలు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతీ దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితరాంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular