ద్రోణ కామారెడ్డి
75వ వన మహోత్సవం పచ్చదనం స్వచ్చదనంపై మున్సిపల్ లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించి ర్యాలీలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ,ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి లో ఎన్నికల్లో పోటీ చేయకున్నా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్నా ,
అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప

అభివృద్ధి అడ్డుకోవడంలో పోటీపడుతున్నరు కొందరు
కామారెడ్డి లో జరుగుతున్న అభివృద్ధి పై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.
కొందరు సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని గాలి మాటలతో డబ్బాలు కొట్టి ప్రభుత్వం నుండి చేపట్టే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు.దంచి కొట్టే ఉపన్యాసాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ జరగడం లేదు గాలి మాటలు నీటి మూటలు గా మారుతున్నాయి.కామారెడ్డి నియోజకవర్గంలో పనిచేయడానికి అధికారులు ఎవరు ముందుకు రావడం లేదు ఇక్కడ పనిచేస్తున్న అధికారులు వేరే దిక్కు వెళ్లిపోతున్నారుప్రతి ఒక్కరు చెట్లను నాటాలి..

నాటిన చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది.
భవిష్యత్తు తరాలకు మంచి ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాటిన చెట్లను సంరక్షించలేరు. కామారెడ్డి పట్టణానికి ప్రత్యేక నిధుల ద్వారా 240 కోట్లతో జలాల్ పూర్ నుంచి మల్లన్న గుట్ట వరకు త్రాగునీరు పైప్ లైన్ల కొరకు నిధులు మంజూరు.కామారెడ్డి మున్సిపాలిటీకి అమృత్ స్కీంమ్ కింద 93 కోట్ల పనులకు టెండర్లు పూర్తి. కామారెడ్డి పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.
కామారెడ్డి నియోజకవర్గానికి సాగునీరు కొరకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పథకం కింద 1200 కోట్లు అవసరముండగా సీఎం రేవంత్ రెడ్డి 200 కోట్లు మంజూరు చేశారు.దీని ద్వారా 2,54,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కామారెడ్డి పట్టణంలో కరెంటు సమస్య లేకుండా తీర్చడానికై త్వరలో కామారెడ్డి పట్టణానికి ప్రత్యేక నిధుల ద్వారా 133/11 సబ్ స్టేషన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
