ద్రోణ ఆర్మూర్
ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు మంగళవారం ఆర్మూర్ పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ని అంకాపూర్ లో ఆర్మూర్ శాసనసభ్యులు స్వగృహంలో కలిసి గల్ఫ్ కార్మికుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్నారై పాలసీ కొరకు ప్రతిపాదనలు సమర్పించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 17 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పాలసీ ప్రకటించబోతుంది . ప్రకటించి మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న ప్రవాసి ల కోసం ” ప్రత్యేక సంక్షేమ బోర్డు” ఏర్పాటుకు చర్యలు తీసుకోవడానికి చొరవ తీసుకొని , తెలంగాణ గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని, గల్ఫ్ లో మృతి చెందిన వారికి 5 లక్షల నష్టపరిహారము, తిరిగి వచ్చిన వారికి పునరావాసము తదితర డిమాండ్లు నెరవేర్చడానికై ప్రస్తుత బడ్జెట్ లోనే 500 కోట్లు కేటాయింపజేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాదనలు మాజీ మంత్రికి మరియు ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి కి కోటపాటి సమర్పించారు. సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
