బోధన్ ద్రోణ:-
ఎంతమందికి రుణమాఫీ వర్తిస్తుందొ
లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలకు పోతున్నా.. క్షేత్రస్థాయిలో వేల మంది రైతులకు ఇంకా మాఫీ కాలేదు.
రాష్ట్రవ్యాప్తంగా రైతులు అటు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ, ఇటు బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.. వడ్డీ కడితేనే మాఫీ అని బ్యాంకులు తెగేసి చెప్పడంతో దిక్కులేక కొత్తగా అప్పు తెచ్చి మరీ కట్టుకున్నవారు ఉన్నారు.. ఒక్కో జిల్లాలో ఒక్కో పరిస్థితి అంతా అయోమయం.. గందరగోళం. రైతు రుణమాఫీ రాని వాళ్లకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది.
దానికి 100 సార్లు ఫోన్ చేసినా కూడా కలిసే పరిస్థితి లేదు దయచేసి సంబంధిత అధికారులు రుణమాఫీ రాని రైతులకు కాలయాపన చేయకుండా రైతులందరికీ తక్షణమే రుణమాఫీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ ని కలిసి విన్నవించి అలాగే కెసిఆర్ వేసిన రైతు బంధు కూడా అమలు చేసి వెంటనే రైతుల ఖాతాలలో అందించాలని కోరారు. ఇట్టి కార్యక్రమం లో కార్మిక సంఘ అధ్యక్షులు రవి శంకర్ గౌడ్ మరియు బోధన్ నియోజకవర్గ యువజన నాయకుడు జక్క సంజు పటేల్. తదితరులు ఉన్నారు
