మొక్కలు నాటి వాటి ని సంరక్షించడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావడం, మరోపక్క ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించినాడే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు విజయవంతం అవుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. బుధవారం బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామంలో “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు.పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, వ్యతిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టం, సీజనల్ వ్యాధులు మొదలగు వాటిపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.గ్రామంలో హనుమాన్ మందిరాన్ని దర్శించుకున్నారు.
