Monday, February 16, 2026

బదిలీ ఉపాధ్యాయులకు తగ్గెల్లి గ్రామస్తులు ఘన సన్మానం

ద్రోణ బోధన్ ఆగస్టు 7

తగ్గేల్లి గ్రామ పాఠశాలలో పలు సంవత్సరాలు విధులు నిర్వహించి ఆదర్శప్రాయాలుగా నిలిచి,బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయ బృందానికి గ్రామస్తులు, ప్రధానోపాధ్యాయులు ధనరాజు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పిఆర్టీ అధ్యక్షులు శంకర్ హాజరయ్యారు. ఉద్యోగులకు బదిలీ సహజమైన ప్రక్రియనేనని విధులు నిర్వహించిన సమయంలో ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి గ్రామస్తుల మన్నానలు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిఆర్టియు జిల్లా అధ్యక్షులు శంకర్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు మంచి సేవలు అందించి గుర్తింపు తెచ్చుకునే విధంగానే ఉద్యోగస్తులు విధినిర్వహణలో బాధ్యతగా మెలిగి ప్రజల్లో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలన్నారు. తొమ్మిదేళ్లు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన మనోజ్, 13 ఏళ్లు పాఠశాలలో విధులు నిర్వహించి విద్యార్థుల మన్నాన్లు పొందిన కృష్ణ, 11 ఏళ్లు విధులు నిర్వహించిన ఆశ, సిఆర్పి స్వర్ణాలత మరియు బదిలీ అయిన నవీన్ అనే ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి మెమొంటోళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం అశోక్, కస్తూరి, హనుమాన్లు మరియు విజయలక్ష్మి బదిలీపై వెళ్తున్న వారికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ లక్ష్మి, చైర్మన్ రాజు, అశోక్, అంబాదాస్, దేవరావు, విటల్, దేవేందర్ మానిక్, దిలీప్ సాయిలు నిఖిల్ శివా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular