Monday, February 16, 2026

ఐదు రోజుల పాపను విక్రయించిన కసాయి తండ్రి

ములుగు జిల్లాలో ఘటన

ద్రోణ ములుగు

ఐదు రోజుల పాపను తండ్రే విక్రయించిన ఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురంలో చోటు చేసుకుంది. నూగురు వెంకటాపురం గ్రామానికి చెందిన జంపయ్య, లక్ష్మీ దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది. అయితే ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంకు చెందిన సుధాకర్ అనే వ్యక్తికి నవజాత శిశువును విక్రయించేందుకు కన్న తండ్రే బేరం పెట్టాడు. భార్యకు తెలియకుండా పాపను తీసుకెళ్లి రూ.15వేలు, పాత ద్విచక్రవాహనం తీసుకుని చిన్నారిని అమ్మేశాడు.
అయితే పాప చనిపోయిందని, తానే స్వయంగా ఖననం చేశానని చెప్పి భార్య, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. జంపయ్య మనస్తత్వం తెలిసిన కుటుంబసభ్యులు, బంధువులు గట్టిగా నిలదీశారు. దీంతో పాపను అమ్మేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో నివ్వేరపోయిన బంధువులు ఏటూరు నాగారం పోలీసులను ఆశ్రయించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular