ద్రోణ ఆర్మూర్ ఆగస్టు 7
జనగామ జిల్లా కేంద్రంలో న్యాయవాద దంపతులు అమృతరావు,కవిత ల పై జరిగిన దాడికి ఆర్మూర్ బార్ అసోసియేషన్ తమ నిరసన వ్యక్తం చేశారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తెడ్డు నర్సయ్య జరిగిన సంఘటన ను మరవలేమని న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆర్మూర్ బారాసోసియేషన్ అధ్యక్షులు తెడ్డు నర్సయ్య హెచ్చరించారు. దాడి కి పాల్పడిన సీఐ రఘుపతి రెడ్డి ని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.అనంతరం కోర్ట్ విధులను బహిష్క రించారు.కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపధ్యక్షులు పోదేటి శంకర్,సీనియర్ న్యాయవాదులు జి జి రాం,ప్రవీణ్,అశోక్,శ్రీధర్,జగదీష్,జగన్,విజయ లక్ష్మి,చరణ్,రాజేశ్వర్,సుకేష్,రాజేందర్, సుభాష్ చంద్రబోస్ కిరణ్,సంజీవ్,కార్తీక్,శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.
