Monday, February 16, 2026

పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

ద్రోణ హైదరాబాద్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత రాష్ట్ర సమితి విలీనం పోత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు మీడియా సంస్థలకు కేటీఆర్ హెచ్చరించారు.
సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన కేటీఆర్.
బిఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి కేటీఆర్ హెచ్చరిక.బిఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బిఆర్ఎస్.సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రప్రదాన నిలిపాము.
ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలని మానుకోవాలి.పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం. కానీ తలవంచం. ఎన్నటికైనా ఎప్పటికైనా ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల మధ్యలో నిలబడి తీరుతాం కేటీఆర్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular