బోధన్ ద్రోణ:-
కొత్తపల్లి పాఠశాలలో జరిగిన కారం అన్నం సంఘటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తప్పుగా పట్టించారాని, ప్రధానోపాధ్యాయునిపై కఠిన చర్యలు తీసుకోవాలని
జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి డిమాండ్ చేశారు. కోటగిరి మండలం, కొత్తపల్లి గ్రామంలో మధ్యాహ్న ఏజెన్సీ నిర్వాహకురాలిపై స్థానిక ప్రధానోపాధ్యాయుడు కావాలని వంట చేసిన తర్వాత మధ్యాహ్న భోజన ఏజెన్సీ మీద కక్ష పెట్టుకున్న హెచ్ఎం పిల్లలు భోజనం చేసినాక నలుగురు పిల్లల ప్లేట్లలో కారంపొడి వేసి ఫోటోలు తీసి దాన్ని వైరల్ చేసి ఆ ఏజెన్సీని తొలగించి మరొక ఏజెన్సీకి పెట్టడం కోసం కుట్ర చేశారని దీన్ని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ గా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఏజెన్సీ నిర్వాహకులను బదనాంకు కారణమైన హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కి డీఈవో దుర్గాప్రసాద్ కు వినతి పత్రం సమర్పించారు. అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకొని మధ్యాహ్న భోజన ఏజెన్సీకి నిర్వాహకులకు న్యాయం చేయాలని, కోరారు. కింది స్థాయి అధికారులు విషయం ప్రచారమైనందున ఏ రకంగా నైనా దీని నుంచి తప్పించుకోవటానికి హెడ్మాస్టర్ కు సహకరించడంలో భాగంగా అమాయకురాలైన ఏజెన్సీ నిర్వాహకురాలిపై చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నారని ఇది నిజమైతే ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూమయ్య ఉషారాణి, అలీ,వీరేశం పాల్గొన్నారు.
