Monday, February 16, 2026

కొత్త నిర్మాణానికి నోచుకునేనా

బోధన్ పాత బస్టాండ్ పరిస్థితి

గత పది సంవత్సరాలుగా పట్టించుకునే నాధుడే లేడు

బోధన్ ద్రోణ:-

పాత బస్టాండ్ ప్రయాణికులతో ఎంతో రద్దీగా ఉండే ప్రదేశం అలాంటి ప్రదేశాన్ని అధికారుల నిర్లక్ష్యం వైఖరి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. బోధన్ ఆర్టీసీ డిపో ఎంతో లాభదాయకంగా నడుస్తుందని ఎన్నోసార్లు ప్రజలు అనుకున్న విషయం అందరికీ తెలిసిందే

మహారాష్ట్రకి బోధన్ మధ్య ఎంతో రద్దీగా ఉన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల రాకపోకలు చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు రద్దీ నెలకొల్పే వాతావరణం అలాంటి దగ్గర సరైన సదుపాయాలు లేని బస్టాండ్ ప్రాంగణం లేకపోవడం ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. ఎన్నో సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి బస్టాండ్ ను పునరుద్దీకరణ చేయకపోవడం

కనీసం మరమ్మత్తులకు కూడా నోచుకోలేకపోవడమనేది హాస్యకరమైన విషయం ఫ్రూట్స్ మార్కెట్ కొత్తగా నిర్మించిన కానీ వారందరూ బస్టాండ్ ప్రాంగణం వద్దని ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారేలా తోపుడు బండ్లపై పెట్టి అమ్మడం జరుగుతుంది. ఎంతో ప్రమాదకరంగా మారినటువంటి బస్టాండ్ ప్రాంగణము లో కరెంటు మీటర్లు బోరు డబ్బాలు పెట్టి ఉండటం వల్ల ఈ వర్షాల కాలంలో విద్యుత్ షాక్కు గురై అవకాశాలు ఉన్నాయని అక్కడ ప్రజలు అంటున్నారు.

కనీసం వర్షం వస్తే నిలబడేందుకు కూడా సరియైన సదుపాయం లేని బస్టాండ్ అయిపోయిందని ఎక్కడికక్కడ పైన వేసినటువంటి స్లాబ్ బీటలు భారీ క్రింద వేసినటువంటి ఫ్లోరింగ్ కూడా చెల్లా చెదురైపోయింది.

కనీసం ఆర్టిసి సిబ్బంది డిపో మేనేజర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి బాగు చేయించాలని అక్కడి ప్రజలు కోరు భాగంగాతున్నారు. వర్షాకాలం మరి ఇబ్బందులకు గురవ్వాలి వస్తుందని ప్రయాణికులు ప్రాంగణం యందు రోడ్డు మొత్తం గుంతల మయంతో గా మరీ ఇబ్బందికరంగా ఉంది. ఈ యొక్క ప్రాంతం ప్రజలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుందని దీనిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక శ్రద్ధలు చూపాలని ప్రజలు కోరుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular