ద్రోణ బాన్సువాడ
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుందామని తమ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.
యువజన కాంగ్రెస్ ఎన్నికల నేపధ్యంలో బాన్సువాడ నియోజకవర్గ స్థాయి యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి.గురువారం బాన్సువాడ పట్టణంలోని మాజీ శాసనసభాపతి, స్థానిక శాసనసభ్యులు పోచారం నివాసంలో జరిగిన ఈ సన్నాహక సమావేశంలో బాన్సువాడ పట్టణంతో పాటుగా నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుండి యువజన కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఆగస్టు 10 వ తేదీ నుండి సెప్టెంబర్ 10 వ తేదీ వరకు జరిగే ఆన్ లైన్ ఓటింగ్ లో ప్రతి కార్యకర్త పాల్గొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు.
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుందాం
RELATED ARTICLES
