Monday, February 16, 2026

గోసంగిలను SC-A గ్రూపులో చేర్చాలి

బోధన్ ద్రోణ:-

ఎస్సి ఉపకులాల సమావేశంలో మంత్రివర్యులు దామోదర రాజనర్సింహకు గోసంగి రాష్ట్ర అధ్యక్షులు గంధం రాజేష్ విజ్ఞప్తి 57ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి
కమిటీ వేసి అది ఇచ్చే రిపోర్ట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిప్రజెంటిషన్ ఇస్తామన్న మంత్రి ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల ను రాష్టాలు వర్గీకరించుకోవచ్చు అనే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం ప్లాజా హోటల్ లో మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మీనారాయణ, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల శామ్యూల్, వేముల వీరేశం, కాలే యాదయ్య, ప్రొ.జి. మల్లేశంలు పాల్గొన్నారు. 57ఉపకులాల స్థితిగతులు తెలుసుకునేల ఈ సమావేశం ఏర్పాటు చేయడం వారందరిని ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాజేష్ అన్నారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉపకులాలలో చాలా కులాలు తమ ఆస్తిత్వం కోల్పోతున్నాయని గోసంగీలు ఆర్థికంగా, సామజికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారని దానికి కారణం గతంలో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ మాలలకు ఉపకులంగా గోసంగిలను SC-C లో చేర్చి అన్యాయం చేసిందని ఆ కమిషన్ మా జిల్లాల్లో పర్యటించలేదని మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా మాల ఉపకులంగా చేర్చి గోసంగిలకు అన్యాయం చేసిందని అన్నారు. మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గోసంగిలను SC-A గ్రూపులో చేర్చి న్యాయం చేయాడానికి చొరవ చూపాలని ఉపకులాల జనాభ పై అనేక సందేహాలున్నాయని కులగణన చేపట్టి జనాభ దామాషా ప్రకారం రిజర్వేషన్ కేటాయించాలన్నారు.

అలాగే ఉపకులాల కోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటులో జాప్యం జరుగకుండా చూడాలని దళిత బంధు తరహాలో ప్రత్యేక పథకాలు అందించి గోసంగిలను ఉపకులాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు దామోదర రాజనర్సింహా మాదిగ మరియు ఉపకులాలకు విద్య ఉద్యోగాల్లో వారి జనాభా ప్రకారం సమాన అవకాశాలు వచ్చేలా చూస్తామన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని స్వతంత్రం ఇచ్చింది తప్ప అమలు చేయాలని ఆదేశించలేదన్నారు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇద్దరు ముగ్గురు లాయర్లు, ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు, ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేసుకొని ముందుకుపోవాలని అంతేకాకుండా గతంలో జరిగిన వర్గీకరణ ఇప్పుడున్న తెలంగాణకు వర్తిస్తుందా లేదా అని ఆలోచించాలని. కుల గణన చేయడం జాతికి నాయకత్వం వహిస్తున్న వారితో కమిటీ వేసుకొని మేదోమదనం చేసిన తర్వాత వచ్చిన సారాంశాన్ని ముఖ్యమంత్రి రిప్రజెంటిషన్ ఇచ్చి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అన్ని కులాల సామాజిక,ఆర్థిక , స్థితిగతులను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి వర్గీకరణ విషయంలో సానుకులంగా ఉన్నారని విద్య, ఉద్యోగాల ద్వారా కేవలం 15 శాతం మందికే అవకాశాలు దక్కుతాయని మరి మిగతా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ప్రభుత్వమే యాభై శాతం సబ్సిడీలతో లోన్లు కూడా ఇచ్చేవిధంగా చూస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోసంగి సంఘం ప్రతినిధులు నిరగొండ బుచ్చన్న, గంధం బుద్దిరాజు, సంకు పోచయ్య, ఈర్నాల లక్ష్మణ్, రాసరి పెంటన్న, పస్తం పరుశురాం, కళ్లెం సత్యం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular