Tuesday, May 19, 2026

మంజీరా ఇసుక క్వారీలను పరిశీలించిన యంత్రాంగం

కామారెడ్డి జిల్లా బీర్కూర్, బిచ్కుంద మండలాల్లో గల మంజీరా నది ఇసుక క్వారీలను గురువారం అధికార యంత్రాంగం పరిశీలించారు. పలు వారిలో ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనుమతులను అడ్డుపెట్టుకొని కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున అక్రమంగా తీసుకొని రవాణా చేసినట్లు ఎన్నో ఆరోపణలు ఎదురైనా. బిచ్కుంద కు చెందిన న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మంజీరా నది ఇసుక క్వారీలను పరిశీలించి నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా అధికార యంత్రాంగం ఇసుక క్వారీలను పరిశీలించారు. బాన్సువాడ ఆర్డిఓ ఆధ్వర్యంలో క్వారీలను పరిశీలించారు. ఆయన వెంట మైన్స్ ఏడి, ఇరిగేషన్ డి ఈ, బాన్సువాడ డి.ఎస్.పి, ప్రాజెక్టు అధికారి, ల్యాండ్స్ ఎడి సర్వే తదితరులు క్వారీలను పరిశీలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular