బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు న్యాయవాదులు, కోర్టు పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు.బోధన్ 5వ ఆదనపు జిల్లా జడ్జి రవికుమార్, సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్, మేజిస్ట్రేట్ మర్కల్ పూజిత, అదనపు మేజిస్ట్రేట్ సాయి శివ లు,కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు అదనపు జిల్లా జడ్జి రవికుమార్ మాట్లాడుతూ స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం యొక్క ఆవశ్యకత గురించి వివరించారు. నాటిన మొక్కలను వృక్షాలు గా పెరిగే వరకు కాపాడటం సంరక్షించడం మన బాధ్యత అన్నారు.వృక్షాల వలన పర్యావరణం రక్షించబడుతుందన్నారు.దీనితోపాటు సమాజానికి,మానవ మనవమనుగడకు అవసరమైన స్వచ్ఛమైన ప్రాణవాయువు తో పాటు పండ్లు ఫలాలు లభిస్తాయి అని అన్నారు. చెట్ల వలన ఎంతో మేలుఉందని,అడవులు అంతరించడం వలన భూతాపం పెరిగి అనేక అనర్ధాలు జరుగుతాయి అని అన్నారు. మొక్కలు నాటడం ప్రజలందరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోధన్ 2వ తరగతి మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి,బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పోశెట్టి,కార్యదర్శి కొట్టేశ్వర రావు,బోధన్ అడ్వకేట్ హౌసింగ్ సహకార సంఘము అధ్యక్షులు ఎం. గంగారెడ్డి,ప్రధాన కార్యదర్శి సీహెచ్.వి హన్మంతరావు, ఉపాదక్షులు బాణోత్ రమేష్,ప్రభుత్వ న్యాయవాది గౌస్ఉద్దిన్, ఏ జి పి బి.రవీందర్,అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్.పి.సమ్మయ్య,సీనియర్ న్యాయవాదులు బి.రాములు,గోపాల్ రెడ్డి,నర్సింహారెడ్డి,జె.నందకుమార్,ఏజాజ్ అహ్మద్, రాజు పటేల్,దత్తత్రిరావు,ఎన్. ఈశ్వర్, శంకర్ అజయ్,ధర్మయ్య, టి.రఘు,గోపి,గంగాధర్ గౌడ్,లక్ష్మన్, కోర్టు,పోలీస్ శిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
