Monday, February 16, 2026

ఆదివాసి ల అభివృద్దే మా ప్రభుత్వ దేయం

ఆదివాసి యోధుడు తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు రాంజీ గొండు భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించిన స్పీకర్ ప్రసాద్ కుమార్, రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ ఆదివాసి భవన్లో జరుగుతున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి సీతక్క

నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆదివాసి గిరిజన విద్యార్థులకు సన్మానం

క్రీడల్లో కనబరిచిన గిరిజన విద్యార్థులను సన్మానించిన సీతక్క

ద్రోణ హైదరాబాద్

ప్రపంచమంతా అత్యంత ఉత్సాహంగా ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న అందరికీ మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.కొండ కోనల్లో వాగులు వంకల వద్ద నివసించే ఆదివాసులు హైదరాబాద్ వంటి నగరాల్లో తమ హక్కుల పై చర్చించే స్థాయికి ఎదగడo అభినందనీయం అన్నారు.తమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశించుకునెలా ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
గిరిజనులు, ఆదివాసీలు పోరాటాలు, త్యాగాలు చేశారు. కానీ ఆ జాతులు అభివృద్ధికి అంతగా నోచుకోలేదు.ఆదివాసి గుడాలకు అభివృద్ధి అందినప్పుడే సమాజము అభివృద్ధి చెందినట్టు అవుతుంది.తరతరాలుగా కులాలు జాతుల పేర అనగారిన వర్గాలపై అణచివేత కొనసాగింది.ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు అవసరమో మేధావులు నిర్ణయించాలి.అధికారులు చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు తెలుసుకొని నివేదికలు అందజేస్తే నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.అధికారులు మేధావులు ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే సమానత్వం సాధ్యమవుతుంది.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అంతా కలిసి అడుగులు వేయాల్సిన తరుణమిది.
ఆదివాసి ప్రాంతాల్లో విద్యా, ఉద్యోగం వైద్యం, రవాణా, తాగునీరు వంటి వస్తునలను అందించే విధంగా పనిచేయాలి.
ఏజెన్సీ ప్రాంతాల్లో గత పది సంవత్సరాలుగా ఉద్యోగాలు రాలేదు.ఐటిడిఏ పరిధిలో ఉన్న జీవో నెంబర్ 3 ను గత ప్రభుత్వం రద్దు చేసింది.దీంతో స్థానిక గిరిజనులు ఉద్యోగం అవకాశాలు కోల్పోయారు.ఎస్టిలకి పెంచిన 10% రిజర్వేషన్లు కోర్టులో పెండింగ్లో ఉంది.గిరిజన ఆదివాసీలను అభివృద్ధి పథంలో నిలపాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 17 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించింది.బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయిని ఏజెన్సీ ప్రాంతాల్లో వెచ్చించి ఆదిమాచాతి ప్రజలను అభివృద్ధి పరుస్తాం.
అటవీ భూమి మీద ఆదివాసీలకు హక్కులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది*
కానీ మోడీ నేతృత్వంలోనికి కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోంది.
2023లో కేంద్ర ప్రభుత్వం సవరణలు తెచ్చి అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది.గ్రామసభల అనుమతులు లేకుండానే ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో యదేచ్చగా మైనింగ్ చేసేలా కేంద్రం చట్ట సవరణ చేసింది.గ్రామసభల అనుమతులు అవసరం లేకుండా ఢిల్లీలో అనుమతి తీసుకుంటే చాలు అటవీ ప్రాంతాల్లో మైనింగ్ విధ్వంసం జరగొచ్చన్న విధంగా కేంద్రం చర్యలు ఉన్నాయి.*
అటవీ ప్రాంతాల్లో మైనింగ్ కి నుమతిస్తున్న కేంద్ర ప్రభుత్వం అడవిలో ఉన్న గ్రామాలకు మాత్రం రోడ్లు వేసేందుకు అనుమతులు పెట్టలేదు.
కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్పొరేట్ కంపెనీలకు సంపద కట్టబెట్టేందుకు మైనింగ్ అనుమతులు ఇస్తూ పోతుంది.
కానీ అడవినే నమ్ముకునే జాతుల కోసం కనీసము రోడ్డు సదుపాయాలు కల్పించడం లేదు.కేంద్ర తీరు చాలా దురదృష్టకరంగా వుంది.ఇది భవిష్యత్ తరాలకు వినాశకరం.
కేంద్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు అంతా అడుగులు వేయాలి ఆదివాసీలో ఉన్నచోటే అడవులు ఉన్నాయంటే.. అడవులను కాపాడింది ఆదివాసి బిడ్డలే .చెట్టును పుట్టను ప్రకృతిని ఆరాధించే ఆదిమా జాతి తో అడవులు ఎప్పుడు నాశనం కావు.ఆదివాసీల ఆహారం ఎన్నో పోషకాలతో కూడుకున్నది
అందుకే పట్టణాల్లోని కోటీశ్వరులు కూడా ఆదివాసీలు దీని ఆహారాన్ని ఈ మధ్య తీసుకుంటున్నారు.
అడవుల్లో, ఆదివాసి హృదయాల్లో స్వచ్ఛత వుంది.
మావి కల్మషం లేని జీవితాలు.
మన భాష సంస్కృతులే మన అస్తిత్వానికి ప్రతికలు.
అన్ని రంగాల్లో మనం ముందు ఉండాలి.ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ మా ప్రభుత్వం ఉంటుంది, పేదరిక నిర్మూలనే మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular