ద్రోణ హైదరాబాద్:ఆగస్టు 09
కాలేజీ క్యాంపస్‌లో హిజాబ్, బుర్కా, నిఖాబ్ ధరించకూడదంటూ చెంబూరు కళాశాల జారీ చేసిన సర్కుల్యర్‌పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ముంబయిలోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
కళాశాల ఆదేశాలను సమర్థిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. కళాశాల విధించిన షరతులపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేంటీ ? అలాంటి రూల్ పెట్టొద్దు. మతాన్ని బయటపెట్టకూడదా..? విద్యార్థుల మతం వెల్లడి కాకూడదనే నిబంధన విధించారంటూ కాలేజీ యాజమాన్యం వాదనలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థుల పేర్లు మతాన్ని బహిర్గతం చేయడం లేదా? నెంబర్స్ ద్వారా వారిని గుర్తించమని అడుగుతారా? అంటూ జస్టిస్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
