Monday, February 16, 2026

ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి: ఆత్రం సుగుణ

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

కొమరంభీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అత్రం సుగుణక్క

ద్రోణ ఆదిలాబాద్

అడవినే నమ్ముకుని జీవించే నిష్కల్మశ హృదయులైన ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆత్రం సుగుణక్క పాల్గొని కొమరంభీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సుగుణక్క పాల్గొని ఆదివాసీ మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఆదివాసీ అభివృద్ధి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. జల్ జంగల్ జమీన్ ,మావ నాటే మావ రాజ్ నినాదాలను విధానాలుగా మలచి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు పథకాలు వారి జీవితాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular