Sunday, February 15, 2026

యువజన కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక

యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటిదని ఎంతోమంది యువత కృషివల్లే లేడు కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతుందని ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో యువతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ యువతకు మరింత ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
శనివారం బాన్సువాడ నియోజకవర్గం లోని నస్రుల్లా బాద్ మండల కేంద్రంలో మీర్జాపూర్ , దుర్కి , బస్వయి పల్లి కంశేటి పల్లి గ్రామంలో యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. కాసుల మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ అనేది కాంగ్రెస్కు వెన్నుముక అంతేకాకుండా పెద్దపెద్ద నాయకులు కేంద్రస్థాయిలో అనేక పదవుల్లో పనిచేశారని వాటికి మూల కారణం యువజన కాంగ్రెస్సేనని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు మమ్మద్ అబ్దుల్ ఖలేక్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అసద్ బిన్ మోసిన్ , మండల మైనారిటీ అధ్యక్షులు యూసుఫ్ , పెర్క శ్రీను , పురం వెంకటి , శ్యామల , మోహన్ , జకీర్ , నియోజక వర్గ అధ్యక్షులు మధు సూదన్ మన్సూర్ , ఎంపీటీసీలు, మాజీ జెడ్పిటిసిలు,మాజీ ఎంపీపీలు,మాజీ సర్పంచులు, ముఖ్య సీనియర్ కాంగ్రెస్,యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular