Monday, February 16, 2026

హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

సీఎం రేవంత్ రెడ్డి

ద్రోణ ఖమ్మం:ఆగస్టు 15

రుణమాఫీ చేయలేరని, కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ మాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్‌ చేశారు. రుణమాఫీ అమలు చేశాం.
హరీశ్‌రావు రాజీనామా చేయాలి లేదంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుం టున్నట్టు హరీశ్‌ రావు చెప్పాలి’’ అని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.సాగుకు జీవం.. రైతుకు ఊతం’ పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
వరంగల్‌ వేదికగా తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తా మని రాహుల్‌ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేశాం. ఖమ్మం గడ్డ కాంగ్రెస్‌ అడ్డా. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచేందుకే ఈ ప్రాంతానికి వచ్చా. 2026 పంద్రాగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరా లకు సాగునీరు అందిందే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రెండు పడక గదుల ఇళ్ల పేరిట కేసీఆర్‌ మోసం చేశారు.
మేం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం. రాష్ట్ర వ్యా ప్తంగా 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. ఆరు గ్యారం టీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular