Monday, February 16, 2026

అత్యాచార నిందితులను బహిరంగంగా శిక్షించాలి సిపిఐ డిమాండ్


సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ చౌరస్తాలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. సిపిఐ రాష్ట్ర నాయకులు కే.భూమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ కలకత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మౌమిత పై సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా శిక్షించాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సంఘటనపై సిబిఐ విచారణ జరిపి బాధ్యులైన ప్రతి ఒక్కరికి బహిరంగ శిక్ష వేయాలని,మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు.వైద్య విద్యార్థిని కుటుంబాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన శిబిరాన్ని సందర్శించి సిపిఐ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు వై రాజిరెడ్డి, కె రాజన్న, ఎం స్వరూపారాణి, రాందాస్, రఘురాం, అంజలి, ఆలీ ఇమ్రాన్, ఫెరోజ్, అమర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular