బోధన్ టౌన్ ద్రోణ:-
ఎస్సి 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా నిరగొండ బుచ్చన్న
హైదరాబాద్ లోని బిసి సాధికారత భవన్ లో ఏర్పాటు చేసిన SC 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన జాతీయ అధ్యక్షులు భైరి వెంకటేష్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లలో ఉపకులాల వాటా ఎంతో తేల్చి శాస్త్రియంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని , ఉపకులాలకు అన్యాయం చేయాలని చూస్తే మరో పోరాటానికి సిద్దమని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం అన్నారు . రిటైర్డ్ జడ్జ్ తో ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
ఉమ్మడి రాష్ట్రం లో అమలుజరిగిన ఎస్సీ వర్గీకరణ వల్ల మాల, మాదిగ గ్రూపులలో చేర్చబడిన ఉపకులాలు అన్ని రంగాలలో తీవ్రంగా నష్టపోయారని గతంలో ఏర్పాటు చేసిన రామచంద్ర రాజు, ఉషామేహరా, లోకూర్ కమిషన్లు స్పష్టంగా తెలుపుతూ ఉపకులాల అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వలకు నివేదికలిచ్చారన్నారు.
గత ఎన్నికల్లో ఎస్సీ ఉపకులాల పోరాటాన్ని ఆనాటి పీసీసీ అధ్యక్షులు నేటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో మాల, మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాలకు కూడా మూడు ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో మాల మాదిగలకు కార్పొరేషన్ లను ప్రకటించి ఉపకులాల కార్పొరేషన్ ను విస్మరించడం ఎవరి కుట్రనో తేల్చలన్నారు. ఇప్పటికైనా ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ను వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ సజావుగా అమలుచేయుటకు, విధివిధానాలు ఖరారు చేయుటకు వెంటనే రిటైర్డ్ జడ్జి తో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు
నూతన కార్యవర్గం ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులుగా నీరగొండ బుచ్చన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాయల నర్సయ్య (చిందు), చంద్రగిరి సత్యనారాయణ (సమగర), టి. ఎన్. స్వామి (మితయాల్వర్), ఔషాదం రవీందర్ (గోసంగి), కర్నె రామారావు (డక్కలి), కార్యనిర్వాహక కార్యదర్శులుగా దొంబర దివాకర్,తల్వరే రమేష్ మాంగ్, మార శంకర్ మాల మాస్టిన్, సిహెచ్ వెంకటయ్య మాదసికురువ, కోశాధికారి ఉపదే సానధన్ మాంగ్ గారోది, రాష్ట్ర కార్యదర్శులుగా హర్షపాక శ్రీనివాస్ మాదిగ దాసు, దాసరి నాగరాజు మాల దాసరి, ప్రచారకార్యదర్శులుగా గడ్డం యాదగిరి చిందు, శాఖమూరి యాదగిరి హోలీయా దాసరి, సంస్కృతిక కార్యదర్శిలు నాగిళ్ళ కిష్టయ్య మాస్టిన్, డాకూరి లింగయ్య డక్కలి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
ఈ కార్యక్రమంలో 57ఉపకులాల పోరాట సమితి నాయకులు, కులసంఘాల అధ్యక్షులు ప్రతినిధులు పాల్గొన్నారు
