మాయమాటలతో అన్నదాతలకు కుచ్చుటోపి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ దేవుళ్లపై ఓట్లు వేసి అభాసుల పాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతన్నలను ఆదుకోవాలి
నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల
ద్రోణ నిజామాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల డిమాండ్ చేశారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో మాయ చేసి అన్నదాతల ఆగ్రహాన్ని తెల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. రైతులకు రుణమాఫీ చేయకుండా సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ జరగలేదంటూ బ్యాంకుల మీదికి తోసేస్తున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకం రుణమాఫీ మీద చేస్తానని చెప్పి మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డి.పార్లమెంట్ ఎన్నికల కోసం ఓట్లు దండుకోవడానికి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల మీద ఓట్లు వేసి ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.తీరా గెలిచిన తర్వాత షరతులతో రుణమాఫీ చేసి రైతుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. డిసెంబర్ లో చెప్పింది 49 వేల కోట్లు, జనవరి వచ్చేసరికి 40 వేల కోట్లు, జూలై నాటికి 31 వేల కోట్లు, చివరికి బడ్జెట్లో ఇచ్చింది. రూ. 26 వేల కోట్లు చివరకు చెప్పింది 17 వేల కోట్లు తీరా రుణమాఫీ అయింది. 7500 కోట్లు అని అన్నారు . 41.78 లక్షల మంది రైతులు ఉంటే 22 లక్షల మందికి రుణమాఫీ అయింది. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేసి అంతే రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని బిగాలా హెచ్చరించారు. దేవుళ్లను కూడా వదలకుండా ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. 6 గ్యారంటీలు అట్టకెక్కిపోయాక, రైతు రుణమాఫీ తుంగలో తొక్కి రైతులకు అన్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూ శరతులు లేకుండా రుణమాఫీ చేయాలి లేకుంటే మరో ఉద్యమం తప్పదు అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్రం నాయకులు రామ్ కిషన్ రావు , నగర అధ్యక్ష కార్యదర్శులు సిర్ప రాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, రవిచందర్, మాజీ నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,ఎనగందుల మురళి తదితరులు పాల్గొన్నారు.
