Monday, February 16, 2026

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ డీసీటీవో

ద్రోణ హైదరాబాద్

హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ సర్కిల్‌ పరిధిలో వాణిజ్య పన్నులశాఖ అధికారి (DCTO ) వసంతాఇందిర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కారు. శుక్రవారం సాయంత్రం కార్యాలయంపై దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న డీసీటీవో (డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌) ను పట్టుకున్నారు.బాధితుడికి సంబంధించిన అకౌంట్‌ లావాదేవీల పరిశీలనకు గాను డీసీటీవో వసంత లంచం డిమాండ్‌ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం వ్యూహం ప్రకారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. పట్టుకున్న సొమ్మును ఆమె నుంచి స్వాధీనం చేసుకుని, ఆమెపై అవినీతి కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి ఉద్యోగి లంచం డిమాండ్‌ చేస్తే 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular