Monday, February 16, 2026

వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి

ద్రోణ బాన్సువాడ

ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్లక్ష్యం చేసే అధికారులను సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. పేద విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తుందని, విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పోచారం అభిలాషించారు.
బీర్కూరు, కోటగిరి మండల కేంద్రాలలో పర్యటించిన పోచారం, మరియు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పర్యటించారు.బీర్కూరు మండల కేంద్రంలో రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించిన పోచారం . డబుల్ బెడ్ రూం కాలనీలో పర్యటించారు.భక్తులతో కలిసి నాగేశ్వర మందిరంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం బిసి రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించిన పోచారం విద్యార్థులకు అందుతున్న వసతి సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.అదేవిధంగా కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మందిరంలో సంకష్టహర గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, భక్తులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular