నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో అమరులు మక్ధూమ్.మోహియుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కే.భూమయ్య,సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ అమరులు, మహాకవి మక్ధూమ్.మహియుద్దీన్ ఆయన సేవలను గుర్తించి ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నైజాం నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ ఆనాటి తెలంగాణలో రజాకార్ల వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ రైతంగ పోరాటానికి పిలుపునిచ్చిన నాయకులని అన్నారు కామ్రేడ్ మక్ధూమ్.మహియుద్దీన్ పిలుపుమేరకే రైతాంగం, ప్రజలు చైతన్యవంతులై నైజాంను తరిమికొట్టి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగిందని ఆయన పోరాటస్ఫూర్తితో కార్యకర్తలు పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నిజామాబాద్ నగర కార్యదర్శి వై.ఓమయ్య, సిపిఐ జిల్లా నాయకులు అడ్డీకే.రాజేశ్వర్, గంగారం,రంజిత్, రఘురాం, గంగాధర్, ఆలీ ఇమ్రాన్, ఫెరోజ్, గంగాధర్ పాల్గొన్నారు.
