Monday, February 16, 2026

దేశానికి చంద్రబాబు ఆదర్శప్రాయులు

ద్రోణ బోధన్

తొలిసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి నేటికీ 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆదివారం బోధన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు కి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. 28 ఏళ్లకు ఎమ్మెల్యే,30ఏళ్లకు మంత్రి,45ఏళ్లకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి,తెలుగు ప్రజల అభివృద్ధికి కొత్త దిశలో మార్గదర్శకత్వం వహించారు.
ప్రస్తుతం నాలుగో పర్యాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సమకాలిన రాజకీయాలలో భారత దేశ రాజకీయ గమనికపై గుర్తింపు పొందారు. తన విశిష్టమైన పరిజ్ఞానం, నేర్పుతో దేశ రాజకీయాలలో తన దైన ముద్ర వేశారు. చంద్రబాబు నాయుడు దీర్ఘకాలం రాజకీయాలలో కొనసాగి తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ అభివృద్ధిలో తన పాత్ర వహించాలని కోరుతూ స్థానిక తెలుగుదేశం నాయకులు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిహెచ్ వి హనుమంతరావు, పావులూరు వెంకటేశ్వరరావు, భాస్కరరావు, రమేష్ బాబు, సచిన్ పటేల్, శివకుమార్, హనుమంతరావు, భాను ప్రకాష్, భరత్, లింగ గౌడ్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular