గత మూడు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షలాతో నష్టం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజలు అందరు ధైర్యంగా ఉండాలి
ద్వoసం అయినా రోడ్లకు త్వరలోనే మరమ్మతులు
తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ద్రోణ హైదరాబాద్
కోదాడ నియోజకవర్గం మోతే మండలం నామవరం లోని పి యన్ ఆర్ పంక్షన్ హాల్ నంద్ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గంలో వర్షాల వల్ల జరిగిన నష్టం పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నీటి పారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురిసిన వర్షాల వల్ల జిల్లాలో నడిగూడెం మండలం కాగిత రామ చంద్రపురం వద్ద ఎన్.ఎస్.పిఎడమ కాల్వకు గండి పడిందని అక్కడ 300 ఎకరాలలో పంట నష్టం జరిగిందని, కాల్వ గండికి వారం రోజులో మరమ్మతులు చేపిస్తామని తెలిపారు. జిల్లాలో ఇద్దరు మరణించారని, 7 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయని 27 ఇల్లులు పార్షికంగా దెబ్బ తిన్నాయని,7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని,7 పశువులు మరణించాయని,20000 ఎకరాలలో పంట కు నష్టం జరిగిందని,14 చెరువులు తెగినాయని,11 రోడ్లు ధ్వంసం అయినయని శాశ్వత మరమ్మాత్తుల కోసం 22 కోట్లు అవసరం అవుతాయని,750 కరెంట్ స్తంబాలు పడిపోయాయని ,150 ట్రాన్స్ ఫార్మర్స్ దెబ్బ తినాయని మంత్రి ప్రాధమిక నివేదిక అందించారు.నష్ట పోయిన ప్రతి ఒక్కరికి నష్ట పరిహారం అందజేస్తామని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా లో వర్షాలు ఇలా పడటం దురదృష్టకరం అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ద్వంసం అయిన రోడ్లు పై వెంటనే నివేదిక అందించిన వెంటనే మరమ్మతులు చేపడతం అని ప్రజలు ధైర్యంగా ఉండాలని మంత్రి అన్నారు.ఈ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎవరైతే నష్టపోయారో వారికి అన్నివిధాలుగా ప్రభుత్వo ఆదుకుంటుంది ఎవరు అధైర్య పడొద్దు మంత్రి కోమటిరెడ్డి అన్నారు.కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి మాట్లాడుతు కోదాడ మున్సిపాల్టీ, రూరల్ మండలం పరిధిలో చాలా నష్టం జరిగిందని, పలు చెరువుల కట్టలు తెగినాయని రోడ్లు ద్వoసం అయినాయని రైతుల ఇళ్లలో ఉన్న ధాన్యం అంత తడిచాయని వారి కోసం రేషన్ షాపు ల ద్వారా బియ్యం అందించాలని, పెర్టిలైజర్ దుకాణాలలో ఎరువుల బస్తాలు తడిచాయని వారికోసం లోన్స్ ఇప్పించాలని, కోదాడ మున్సిపాల్టికి నిధులు లేవని ప్రత్యేక నిధులు ఇప్పించాలని ముఖ్యమంత్రి ని కోరినారు.తుంగతుర్తి శాసన సభ్యులు మాట్లాడుతు కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవాటానికి వచ్చిన ముఖ్యమంత్రి కి ధన్యవాదములు తెలిపారు.

తెగిన చెరువులకి మరమ్మతులు చేపట్టి రైతంగాన్ని ఆదుకోవాలని కోరినారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతు జిల్లాలో గత మూడు రోజులుగా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో సగటున 300 మిమి, మద్దిరాలలో 450 మిమి, జిల్లా మొత్తం సగటున 160 మిమి వర్షం కురిసిందని, ఒక రోజు ముందుగానే అధికారులను అప్రమత్తత చేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను జాగ్రత్త పడేలా చూశామని, గ్రామాలలో, పట్టణాలలో శానిటేషన్ చేసి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, తెగిన చెరువులు, రోడ్లు,మరణించిన పశువుల నివేదిక త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈరోజు జిల్లాలో అన్ని పాఠశాలలకు సెలవు ఇప్పించటం జరిగిందని, రెసిడెన్షియల్ పాఠశాలకు రెండు లేదా మూడు రోజులు సెలవులు మంజూరు చేయటం జరిగిందని, అధికారులందరు ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం క్షేత్ర స్థాయి లో పర్యవేక్షణ చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశం లో నల్గొండ ఎంపి రఘువీర్ రెడ్డి,ఎస్ పి సన్ ప్రీత్ సింగ్,ప్రభుత్వ సలహా దారులు వెంరెడ్డి నరేందర్ రెడ్డి, పర్యాటక సంస్థ చైర్మన్ రమేష్ రెడ్డి,ఇరిగేషన్ ఎస్ ఈ రమేష్ బాబు,అదనపు ఎస్. పి. నాగేశ్వరావు, ఆర్ డి ఓ వేణు మాధవ్,జిల్లా అధికారులు, తహసీల్దార్ లు పాల్గొన్నారు.
