Sunday, February 15, 2026

పోచారం దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకొని రాజకీయాలను దిగజార్చుతూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయాలని చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ నాయకులు హెచ్చరించారు.
వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాస రావు, మండల అధ్యక్షులు నందు పటేల్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ , రాష్ట్ర యువ నాయకులు భానోత్ రమేష్ , మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ సభ్యత్వం చేస్తుంటే ఓర్చుకోలేని పోచారం శ్రీనివాసరెడ్డి వారి అనుచరులు లేని పోనీ అపోహలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులపై దొంగ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చేసేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే నని తెలియజేశారు.కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది తలపెట్టిన సహించేది లేదని హెచ్చరించారు. 40 సంవత్సరాలుగా కష్టనష్టాలకు ఓర్చి అప్పటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్ని భయభ్రాంతులకు గురిచేసిన పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసి బిజెపి పార్టీకి ఓట్లు వేయించారు. మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి కృషితో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ సేట్కార్ నీ బాన్సువాడ నియోజకవర్గం తరఫునుంచి 9000 మెజారిటీ ఇవ్వడం జరిగింది.ఎంపీ ఎలక్షన్ తర్వాత జాయిన్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అదే పాత పద్ధతిలో కార్యకర్తలపై కేసులు పెట్టడం తీవ్రంగా ఖండించారు.వారి వైఖరి మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎంపీ ఎలక్షన్లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మంత్రి కేటాయించినటువంటి ప్రొసీడింగ్లను క్యాన్సిల్ చేయడం వారి హోదాకు తగదని అన్నారు. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే చెప్పుకునే పోచారం శ్రీనివాస్ రెడ్డి నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. క్యాన్సిల్ చేసినటువంటి ప్రొసీడింగ్లను ఎంపీ దృష్టికి తీసుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి మళ్లీ తిరిగి అప్రూవ్ చేపిస్తామని కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular