Sunday, February 15, 2026

దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి

నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, ఓటు హక్కు18 సంవత్సరాలు పైబడిన వారందరికీ భారత రాజ్యాంగం కల్పించిందని అన్నారు.సమాజానికి జమిలీ ఎన్నికలు కాకుండా అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే నిర్వహిస్తున్నటువంటి దామాషా ఎన్నికలు దామాషా పద్ధతి అనగా (వ్యక్తులను ప్రకటించకుండా ఆయా రాజకీయ పార్టీల గుర్తులతో గెలిచి ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పార్టీకి వచ్చిన ఓట్ల ప్రకారం సీట్లు కేటాయించి పార్లమెంటు,అసెంబ్లీలకు పంపడం) గత 12వ పార్లమెంట్లో, 14వ పార్లమెంటు సమావేశాల్లో నాడు నల్గొండ ఎంపీగా ఉన్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం.సుధాకర్ రెడ్డి దామాషా పద్ధతిలో ఎన్నికల విధి,విధానాలు ఏ విధంగా ఉంటాయనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి ఈ చట్టం కొరకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ జిల్లా నాయకులు వై.రాజిరెడ్డి, పి.నరసింగరావు, హనుమాన్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular