జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం
మహారాష్ట్ర లోని నాందేడ్ పార్లమెంట్ ఎంపీ చవాన్ బలవంత్ రావు ఆకస్మిక మృతి చెందారు. మృతి చెందడంతో నాందేడ్ పార్లమెంట్ స్థానానికి బై ఎలక్షన్ సందర్బంగా నాందేడ్ పార్లమెంట్ ఇంచార్జి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. నాందేడ్ పార్లమెంట్ తో పాటు భోకర్ నియోజికవర్గం, నాందేడ్ నార్త్,నాందేడ్ సౌత్, నాయే గావ్, దెగ్లూరు, ముఖేడ్ నియోజికవర్గం నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాందేడ్ పార్లమెంటు స్థానాన్ని తిరిగి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ చాటుకోవాలని ఎంపీ సురేష్ షేట్కార్ పిలుపునిచ్చారు.

ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఉన్నారు.
ఈ కార్యక్రమం లో పార్లమెంట్ నాయకులు పాల్గొన్నారు.
