Sunday, February 15, 2026

పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వాలు ఎంతగానో కృషి

జుక్కల్ ఎమ్మెల్యే

ద్రోణ జుక్కల్

పోషకాహార లోపాల వల్ల పుట్టే బిడ్డలు తల్లులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషకాహారాలను తల్లులకు అందించడం జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్నారు. బిచ్కుంద మరియు మహ్మద్ నగర్ మండల కేంద్రాల్లో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ (పోషణ మాసం) కార్యక్రమంలో
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పోషణ్ అభియాన్ పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తుంటారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం మరియు పోషకాహార లోపాలపై అవగహన కల్పించారు.పౌష్టిక ఆహారం లోపం వల్ల రక్త హీనత, జనన బరువు తగ్గుదల మొదలగు ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని చెప్పారు.

గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకుంటే తల్లి బిడ్డ ఎలాంటి పోషకాహర లోపం లేకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించాలని,ఆరు నెలలు తల్లి పాలు మాత్రమే బిడ్డకు ఆహారంగా ఇవ్వాలని,తల్లి పాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని, బిడ్డ ఎదుగుద‌ల‌కు ఎంత‌గానో దోహ‌ద ప‌డ‌తాయ‌న్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలను సమయానికి అందజేయాలని అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్త్ వర్కర్లకు సూచించారు.

పోషకార లోపాలను అదిగమించడానికి అంగన్వాడీ వర్కర్లు మహిళలలో అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు. అంగన్వాడీ సెంటర్లలో సిబ్బంది కొరత మౌలిక సదుపాయల సమస్యలు గురించి తన దృష్టికి వచ్చిందని త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular