Sunday, February 15, 2026

జూన్ నుంచి పామాయిల్ రైతులకు అందుబాటులోకి నర్మెట ఆయిల్ ఫామ్

ద్రోణ సిద్దిపేట ప్రతినిధి

ఫ్యాక్టరీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి సిద్ధిపేట.రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అధికారులను ఆదేశించారు. నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను ఆయిల్ ఫెడ్ అధికారులు జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఆర్. మేనేజర్ సత్యనారాయణ,ఇతర అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్‌ ఫామ్‌ ఫ్యాక్టరీ పనులను వేగవంతం చేసి వచ్చే జూన్ వరకు రైతులకు అందుబాటులో కి తెచ్చేందుకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, అన్ని వసతులతో కూడిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నర్మెటలో నిర్మించడం జరుగుతుందన్నారు.

ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాదు.రిపైనరీని పెట్టి ఫైనల్ ప్రొడక్ట్‌ను ఇక్కడ నుంచే నేరుగా మార్కెట్‌లోకి పంపడం జరుగుతుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular