ద్రోణ వరంగల్ ప్రతినిధి
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అధికారాన్ని రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజకీయ పార్టీలకతీతంగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచుకుందామని మంత్రి కొండ సురేఖ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రులు కొండా సురేఖ మరియు పశ్చిమ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.ఈ సందర్భంగా సభ మొదటగా 61వ డివిజన్ కార్పొరేటర్ దివంగత ఎలకంటి రాములు మరణానికి సంతాపం తెలియజేసి, మౌనం పాటించింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజా పాలనకు నిదర్శనంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం. కార్పొరేషన్ పరిధిలో 13 డివిజన్ల లో ఉన్న ప్రజలు సమావేశ సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.నయీమ్ నగర్ నాలా పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేయించి నా నియోజకవర్గ పరిధిలోని 56 డివిజన్ కి ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి మరియు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.


ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లకు సైతం మాట్లాడే అవకాశం కల్పించిన సభ ప్రతి అంశం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తాం. ప్రజా సంక్షేమమే మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం స్థానికంగా శాసన సభ్యులుగా మేము చేసిన పనులను చేయబోయే పనులను చేయాల్సిన పనులను సభలో సవివరంగా వివరించడం వివరించారు. మేయర్, మంత్రి,ఎమ్మెల్యేలమందరం వరంగల్ కార్పొరేషన్ కి రావాల్సిన నిధుల కోసం సభ తీర్మాణం తెలిపింది.


ప్రథమ పౌరులకు కనీస స్వేచ్ఛ ఇవ్వని దాఖలలు, కానీ నేడు అన్ని పార్టీల కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం కల్పించడం జరిగింది. అభివృద్ధి,సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఎటువంటి తారతమ్యం లేదు. బిఆర్ఎస్ హయాంలో కార్పొరేషన్ నడిపించిన పోకడలకు స్వస్తి పలికి మంత్రి ,మేయర్ ,ఎమ్మెల్యేలు అందరం నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
