ద్రోణ ప్రతినిధి:-
బోధన్ నియోజకవర్గంలో గురువారం రోజున చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట వీరనారి బహుజన నాయకురాలు చాకలి ఐలమ్మ అని ఆమె చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆమె బాటలో నడవాలని సూచించారు. గడీలపై గలమెత్తిన భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత. బహుజన ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
