Sunday, February 15, 2026

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా బాపూజీ

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

అణ గారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీకి ఈ సమాజం రుణపడి ఉంటుందని, ఆయన బాటలో యువత నడవాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు మంత్రి హాజరయ్యారు.పోరాట యోధుడు పదవులను తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పుట్టడం మరణం కి మధ్య ఏ లక్ష్యం కోసం ఆశయం కోసం పని చేసారో అదే ముఖ్యం. జనం కోసం పుట్టి జనం కోసం మరణిస్తే జన నాయకుడు అవుతారు.నిజాం కి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు, ప్రత్యేక రాష్ట్రం కోసం అణగారిని వర్గాల హక్కుల కోసం జీవితాన్ని ధారపోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, పోలీసు కేసులు జైలు ,పదవులు త్యాగం చేసి తెలంగాణా కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి వ్యక్తి అని మంత్రి అన్నారు.

తెలంగాణ నిజమైన బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ.దేశం కోసం మహనీయులు గాంధీజీ.. గాంధీజీ సిద్ధాంతాలు మార్గం గా ఎంచుకొని పోరాడారు. ఎమ్మెల్యే, మంత్రి ,డిప్యూటీ స్పీకర్ గా ఎన్నో పదవులు అధిరోహించి ఆదర్శప్రాయులుగా నిలిచారని అన్నారు.అణగారిన వర్గాల గొంతుక బడుగు బలహీనవర్గాల కోసం పోరాడిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ.
వారి జయంతి అధికారికంగా నిర్వహించుకుంటున్నం.
భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ప్రముఖుల జయంతి వేడుకలను నిర్వహించుకుందాం అని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular