ద్రోణ హైదరాబాద్
కడియం ఫౌండేషన్ ద్వారా 35వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కుసుమ శ్రీవల్లి కి ఇంజినీరింగ్ చదవడానికి సరైన ఆర్థిక స్తొమత లేక ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి వెళ్ళగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థిని చదువుకు అవసరమైన కళాశాల ఫీజును కడియం ఫౌండేషన్ ద్వారా అందిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా గతంలో బీటెక్ మొదటి సంవత్సరం కళాశాల ఫీజు 35వేల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే , ఇప్పుడు బీటెక్ రెండవ సంవత్సరానికి సంబందించిన కళాశాల ఫీజు ను విద్యార్ధిని శ్రీవల్లి కి అందజేశారు. ఈ సందర్బంగా విద్యార్థిని తమ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని తన చదువుకు ఆర్ధిక సహాయం అందజేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి కి, కడియం ఫౌండేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
