ద్రోణ హైదరాబాద్
రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తమ్ రెడ్డి నిన్న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకుని సోమవారం హైదరాబాద్ లోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి వారి తండ్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మరియు వారి కుటుంబాన్ని పరామర్శించిన పోచారం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
