Sunday, February 15, 2026

రుణమాఫీపై కదం తొక్కిన రైతన్న

గాంధారిలో రైతుల మాహా ధర్నా

ద్రోణ కామారెడ్డి ప్రతినిధి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలంటూ కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కదము తొక్కిన రైతన్నలు. రుణమాఫీ పేరిట హామీల వర్షం కురిపించి నేడు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రంలో రైతులు మహా ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.రైతుల మహా ధర్నాకు మద్దతిస్తూ పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్.మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ ఎన్నికల్లో బూటకపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.అర్హులైన రైతులందరికీ వెంటనే బేశరతుగా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
హైడ్రా పేరుతో డ్రామాలు వేస్తూ రైతులకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకోం అన్నారు.

ఉద్యమాలకు పురిటి గడ్డ గాంధారి మండలం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.వరి పంటకు క్వింటాలుకు 500/- బోనస్ ఇస్తానని మోసం చేసి ఇప్పుడు కేవలం సన్న వరి కి మాత్రమే ఇస్తననడం సరికాదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఖబర్డార్ రైతులను & రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నా కార్యక్రమంలో గాంధారి మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన రైతన్నలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular