Sunday, February 15, 2026

ఫలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కృషి

రూ. 250 కోట్ల విలువైన టెక్నాలజీ యూనిట్ అమరావతికి మంజూరు

ద్రోణ గుంటూరు ప్రతినిధి

గుంటూరు అభివృద్ధి, ప్రాజెక్టుల కోసం పెమ్మసాని ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతవరకు ఆయన ప్రయత్నాలు ఫలించాలని చెప్పుకోవచ్చు.గుంటూరును నెంబర్ వన్ పార్లమెంట్ గా తీర్చిదిద్దుతానన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా పెమసాని చంద్రశేఖర్ తన ప్రయత్నాలను వేగవంతం చేశారు.పార్లమెంటు పరిధిలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, శంకర్ విలాస్ వంతెనతో పాటు పలు ఆర్ఓబి, ఆర్ యు బి ల ఏర్పాటుకు ఇప్పటికే పెమ్మసాని శ్రీకారం చుట్టారు.
అలాగే అమరావతికి పలు ప్రాజెక్టులను, పరిశ్రమలను తీసుకురావడంలోనూ ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రూ. 250 కోట్ల విలువైన టెస్టింగ్ ఫెసిలిటీస్ తో కూడిన టెక్నాలజీ సెంటర్ ను అమరావతికి మంజూరు చేయించడంలో గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సఫలీకృతులయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో పెమ్మసాని ఇప్పటికే పలు ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు.అందులో భాగంగా అమరావతికి ఈ ఎమ్. ఎస్. ఎమ్. ఈ. టెక్నాలజీ సెంటర్ ను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత కార్యాలయాలకు, ఉన్నతాధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీని సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సి ఆర్ డి ఏ కమిషనర్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అమరావతి సి ఆర్ డి ఏ పరిధిలోని సుమారు 20 ఎకరాలలో త్వరలోనే ఈ టెక్నాలజీ సెంటర్ కు పునాది పడబోతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular