ద్రోణ విజయవాడ ప్రతినిధి
రహదారిపై అధిక మోతాదు తో బండరాలను ప్రమాదకర పరిస్థితుల్లో రవాణా చేస్తున్నప్పటికీ అధికారులు కట్టడి చేయకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలు కన్నా, బడా బాబుల లాభాలకే అధికారులు వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసమని విజయవాడ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్వారీ యజమానుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం మితిమీరిన లోడ్లతో బండరాళ్ల లోడుతో క్వారీ నుండి విజయవాడకు నిత్యం వందలాది లారీలు జాతీయ రహదారిపై వారి స్వలాభాల కోసం లారీ యజమానులు పరిమితికి మించి లోడుతో వెళ్ళటం వల్ల అటు పాదాచారులకు ఇటు వాహనదారులకు నిత్యం ప్రాణ సంకట ప్రమాదవశాత్తు లారీ పై నుండి అటు పాదచర్ల, వాహనదారులు గాని నిలువునా ప్రాణాలు బలి తీసుకోవటమే కానీ ప్రజా శ్రేయస్సును ఆలోచించి లారీ యజమాన్యం గాని క్వారీలో యాజమాన్యం గాని బండరాలలోడును తగ్గించి రవాణా చేసుకుంటే ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని పలువురు ఆరోపిస్తున్నారు. సుమారు 50 టన్నుల బండ రాళ్లను లారీలకు ఎత్తి రవాణా చేస్తూ సొమ్ము చేసుకోవడమే క్వారీ యజమానుల లారీ యజమానుల లక్ష్యంగా మారుతుంది. ఇటువంటి ప్రమాదకరమైన లోడుతో ఉన్న లారీలను జాతీయ రహదారులపై అనుమతులు ఇవ్వటం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు బెంబేలెత్తిపోతున్నారు. ఎంత జరుగుతున్న అటు రవాణా శాఖ కాని ఆర్టీవో అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడమే కారణం అంటున్న ప్రజానీకం ఈ ప్రమాదవశాత్తు జారిపడిన రోడ్డుపై వెళ్లే అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసి పోవడమే ఈ రవాణాను అధికారులు మైనింగ్ శాఖ అధికారులు ట్రాన్స్ పోర్ట్ అధికారులు ఆర్టీవో అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి ప్రమాదకరమైన బండరాళ్ల రవాణాను క్రమబద్ధీకరించాలని పాదచారులు వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు అంటూ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
