Sunday, February 15, 2026

మూసి బాధితులకు అండగా ఉంటాం

కేటీఆర్,సబితా ఇంద్రారెడ్డి

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మూసి పరీవాహక ప్రాంతాల్లో బాధితులకు అండగా గులాబీ దళం. కదం తొక్కిన బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు,సబితా ఇంద్రారెడ్డి ల నేతృత్వంలో,మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి,చామకూర మల్లారెడ్డి, మహమూద్ అలీ, శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకులు సిరికొండ మధుసూదనాచారి,ఎంపీ వద్దిరాజు రవిచంద్ర,యువ నేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి మూసీ బాధితులకు సంఘీభావం తెలిపారు.

బాధితులకు తమ పార్టీ కొండంత అండగా ఉంటుందని భరోసానిస్తూ, సంఘీభావం చెబుతూ కే.టీ.రామారావు నాయకత్వాన బీఆర్ఎస్ ప్రముఖులు మూసీ నది ఒడ్డున ఉన్న అత్తాపూర్,హైదర్ గూడ,కిషన్ బాగ్ లను సందర్శించారు.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం అత్తాపూర్ లోని పార్కులో పెద్ద సంఖ్యలో గుమిగూడిన బాధితులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించారు.

ఈ బృందంలో కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కౌశిక్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్,బీఆర్ఎస్ నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ,పటోళ్ల కార్తీక్ రెడ్డి,బాల్క సుమన్,గెల్లు శ్రీనివాస్ యాదవ్, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular