ద్రోణ నిజామాబాద్
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఫ్రెండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. మున్సిపల్ యూనియన్ సమావేశం సిఐటియు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర అంటే ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు జరుపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నప్పటికీ కార్మికుల సమస్యలను చర్చించకపోవడం సరైనది కాదని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని శానిటేషన్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డ్రైవర్లకు ఇంజనీరింగ్ సిబ్బందికి 29 వేల రూపాయలు ఇవ్వాలని ఇబ్బందికి 31,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు పెంచాలని ఇప్పటికే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించ్చి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందని. రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయల వేతనం నిజాంబాద్ కార్పొరేషన్ పరిధిలోని డ్రైవర్లకు మూడు నెలలు ఇచ్చి వెనక్కి తీసుకోవడం జరిగిందని అధికారులు వెంటనే మున్సిపల్ డ్రైవర్లకు పెంచిన వేతనం ఇవ్వాలని అనేకమార్లు మొరపెట్టుకున్నప్పటికీ అమలు జరపటం లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని వెంటనే గత రెండు సంవత్సరాలుగా బకాయిలు ఉన్న డ్రైవర్ల వేతనాన్ని అమలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, ఏక్ నాథ్, సంతోష్ సింగ్, సూర రవి తదితరులు పాల్గొన్నారు.
