Sunday, February 15, 2026

14వ వార్షికోత్సవ వేడుకలు

ముఖ్య అతిథి ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి ద్రోణ:-

ఎడపల్లి సాయిబాబా ఆలయంలో 14వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ని ఆహ్వానించి ఆలయ వ్యవస్థాపకులు ఆలయ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.

అనంతరం వెంకటేశ్వర శర్మ మాట్లాడుతూ మంగళవారం రోజున నామస్మరణ సచరిత సాంస్కృతిక కార్యక్రమాలు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం వేడుకలు నా ఆధ్వర్యంలో జరగడం. నాకెంతో గర్వంగా ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వెంట అరికెల నరసింహారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిల్లా రామ్మోహన్, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ రజిత ఎల్లయ్య యాదవ్, తాజా మాజీ సర్పంచ్ పాల్ద భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సరిదాస్ బుడ్డ పోశెట్టి, కాంగ్రెస్ నాయకులు పరాన్, బోధన్ సీఐ విజయ్, ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి, నాయకులు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular