Sunday, February 15, 2026

బిజెపి నిరసన దీక్షలు ప్రభుత్వం మెడలు వంచుతాం

సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు

ద్రోణ హైదరాబాద్

నగరంలోని ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్ లో మంగళవారం రైతు హామీల సాధన దీక్షలో భాగంగా రెండవ రోజు కొనసాగిన దీక్షలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలు చేపడతామని, ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు.రైతులకు సంబంధించి 8 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నామని, వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1. ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలి. రూ.2 లక్షల పైన ఉన్న రుణాల విషయంలో ముందస్తుగా చెల్లింపులు చేయాలని రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తేవద్దు.రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఎకరానికి 15 వేల రూపాయలు చెల్లించాలి.
రైతు భరోసా కింద ప్రతి కౌలు రైతుకు ఎకరానికి 12 వేల రూపాయలు చెల్లించాలి. ఇటీవలి వరదల వలన నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి.

రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అమలు చేయాలి.సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించాలి.ధరణి పోర్టల్ వలన నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి. తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.భాజపా తెలంగాణ ఇంచార్జ్ అభయ్ పాటిల్ రైతు దీక్షలో కూర్చున్న ప్రజా ప్రతినిధులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్చార్జి & కర్ణాటక శాసన సభ్యులు అభయ్ పాటిల్, శాసన సభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, బంగారు శృతి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి, కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తు దీక్ష ముగింపులో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular