Sunday, February 15, 2026

మహాత్మ భారతదేశానికే ఆదర్శప్రాయులు

జాతిపితకు నివాళులు అర్పించిన పోచారం

ద్రోణ బాన్సువాడ ప్రతినిధి

మహాత్మా గాంధీ భారతదేశానికి ఆదర్శప్రాయులని అహింసతో పోరాటం చేసి బ్రిటిష్ వారిని పారదోలి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానీయుడని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.జాతిపిత, మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పోచారం.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ,బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన పోచారం

బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రి ఆవరణలో నూతన భవన నిర్మాణ పనులు చేపట్టడంతో రోగులకు వైద్య సేవలు అందించేందుకు మాతా శిశు ఆసుపత్రి వెనుక తాత్కాలికంగా నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular