ద్రోణ బోధన్ ప్రతినిధి
స్వాతంత్రం సిద్ధించడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి హింసను ప్రేరేపించకుండా అహింసా వాదంతో బ్రిటిష్ తెల్లదొరలను పారదోలి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను లైన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్ పల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎల్ బి ఎస్ నగర్ లో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విజయసాయి పాఠశాలలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ డేను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో సీనియర్ సిటిజెన్లకు ఘనంగా సన్మానించారు. సరోజనమ్మ చేస్తున్న సామాజిక సేవను కొనియాడుతూ వక్తలు అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, గణపతి రెడ్డి, ఐ ఐ ఆర్ చక్రవర్తి, కృష్ణమోహన్ శ్రీనివాసరాజు, వెంకట సుబ్బారావు, గాంధీ, రాధాకృష్ణ, హరిబాబు, నాయిని కృష్ణ, దుర్గారావు, హరిబాబు, గోపి, ముళ్ళపూడి శ్రీనివాస్, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.
