Sunday, February 15, 2026

మహాలో గులాబీ పార్టీ ఎన్సీపీలో విలీనానికి ముహూర్తం పిక్స్?

ద్రోణ హైదరాబాద్:అక్టోబర్ 02

తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం అయింది, ఇక లోక్ సభ ఎన్నికల్లో అయితే ఒక్క సీటు కూడా సంపాదించు కోకపోవడం తో అధికార పార్టీకి బలాన్ని ఇచ్చింది.
మరి కొద్ది రోజుల్లోనే మహారాష్ట్ర లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలు చేసేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తర్వాత మహా రాష్ష్ర పైనే పెద్దెత్తున ఫోకస్ పెట్టారు. అంతేకాదు మహారాష్ట్రలో పార్టీని సైతం ఏర్పాటు చేశారు. ఎన్నోసార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలను కూడా నిర్వహించారు. అయితే గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి నోరుమెదపలేదు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టలేదు. దీంతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి పక్క పార్టీలవైపు వెళ్లేలా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని బిఆర్ఎస్ పార్టీలోని నాయకులు శరద్ పవార్ ఆధ్వర్యంలో ఎన్సీపీ లో చేరి బిఆర్ఎస్ పార్టీని విలీనం చేయనున్నారు. తాజాగా మహారాష్ట్ర బిఆర్ఎస్ నేతలు శరద్ పవార్ తో కీలక భేటీ నిర్వహించారు. అనంతరం అక్టోబర్ 6వ తేదీన పూణే లో ఎన్సీపీ ఆధ్వర్యం లో జరిగే కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీని నేత లంతా,మూకుమ్మడిగా అక్కడ బిఆర్ఎస్ పార్టీని ఎన్సీపీలో విలీనం చేయబోతున్నారని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular